లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సప్లై ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఓ ఎలక్ట్రికల్‌ ఏఈని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామ శివారులో ఉన్న లక్కీ ఇండస్ట్రీస్‌లో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఫిట్‌ చేశారు. దీనికి విద్యుత్‌ సప్లై ఇచ్చేందుకు ఇండస్ట్రీ నిర్వాహకులు మనోహరాబాద్‌ ఎలక్ట్రికల్‌ ఏఈ కృష్ణను సంప్రదించారు.మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రేడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. …

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ

ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సప్లై ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఓ ఎలక్ట్రికల్‌ ఏఈని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామ శివారులో ఉన్న లక్కీ ఇండస్ట్రీస్‌లో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఫిట్‌ చేశారు. దీనికి విద్యుత్‌ సప్లై ఇచ్చేందుకు ఇండస్ట్రీ నిర్వాహకులు మనోహరాబాద్‌ ఎలక్ట్రికల్‌ ఏఈ కృష్ణను సంప్రదించారు.
మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రేడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రయివేటు పరిశ్రమకు 63 కేవీ 3 ఫేస్ లైన్ అవసరం కావడంతో విద్యుత్ సర్వీస్ గురించి ఏఈ కృష్ణను యజమాని కలిశారు.దీంతో రూ.50 వేలు ఇస్తే పని పూర్తవుతుందని ఏఈ చెప్పడంతో చివరకు రూ. 30 వేలకు ఒప్పందం చేసుకున్నారు.

దాంతో ఏఈ కనెక్షన్కు రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా ఈ నెల 17న రూ.10 వేలు ఇవ్వగా మరో రూ.20 వేలు సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఇస్తున్నట్టు ఏసీబీకి సమాచారం అందడంతో నిఘా పెట్టారు.

విద్యుత్ కార్యాలయం వద్ద మిగతా డబ్బు రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్రెడ్డి ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్తో కలిసి ఏఈ కృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈ కృష్ణను ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు.

రెండో ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్‌లో చోటు చేసుకుంది. 32వ వార్డు అధికారి నల్లంటి వినోద్‌ రేషన్‌కార్డు ప్రాసెస్‌ చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.2.500 లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అరెస్టయిన వారి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను వరంగల్, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Updated On 28 Jan 2025 11:21 AM IST
cknews1122

cknews1122

Next Story