ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య ప్రియుని వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్‌ ఎస్వీనగర్‌కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్కేసర్‌లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. నాచారం రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్‌రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ …

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

ప్రియుని వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్‌ ఎస్వీనగర్‌కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్కేసర్‌లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది.

నాచారం రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్‌రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు.

కాగా ఇంద్రచరణ్‌రెడ్డి గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేయడం, వేధించడంతో మనస్తాపానికి గురైన పూజిత సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్మకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఇంద్రచరణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Updated On 29 Jan 2025 1:23 PM IST
cknews1122

cknews1122

Next Story