ప్రెస్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్….. గంజాయి తరలిస్తూ పట్టుబడిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు… సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ), జనవరి 30, మీడియా ముసుగులో నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులకు పట్టుబడ్డారు. కారుకు ప్రెస్ స్టిక్కర్ తగిలించుకుని, గంజాయిని దర్జాగా దాటించేద్దాం అనుకున్నారు. అధికారులకు పక్కా సమాచారం అందడంతో నిఘా పెట్టిన అధికారులు పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ చెక్ …

ప్రెస్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్…..

గంజాయి తరలిస్తూ పట్టుబడిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు…

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

జనవరి 30,

మీడియా ముసుగులో నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులకు పట్టుబడ్డారు. కారుకు ప్రెస్ స్టిక్కర్ తగిలించుకుని, గంజాయిని దర్జాగా దాటించేద్దాం అనుకున్నారు. అధికారులకు పక్కా సమాచారం అందడంతో నిఘా పెట్టిన అధికారులు పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం నుండి బూర్గంపాడు వైపు వెళ్తున్న కారు హుండాయ్ గ్రాండ్ ఐ 10 ఆస్తా కారు ఏపీ 37 బి యు 5216. రాగా అట్టి కారును తనిఖీ చేయగా అందులో 81.950 కిలో గ్రాముల ఎండు గంజాయి లభ్యమైనది, అట్టి గంజాయిని తరలిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని విచారించగా అట్టి వ్యక్తుల పేర్లు 1) మడవి నంద, తండ్రి. హిర్మా, 41 సం" , కోయ, కూలి, నివాసం. మర్లగూడ (గ్రామం). కుంట తాలూకా సుక్మా జిల్లా, చతిస్గడ్. 2. పండగ వెంకటేశ్వర్లు, తండ్రి. నరసయ్య, 34 సం" , వృత్తి: ప్రెస్ రిపోర్టర్, మాల, నివాసం . సోంపల్లి (గ్రామం). బూర్గంపాడు మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 3. పండగ రాములు, తండ్రి. నరసయ్య, 46 సం", మాల, వృత్తి: ప్రెస్ రిపోర్టర్ , సోంపల్లి (గ్రామం), బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.తదుపరి విచారణ నిమిత్తం ముగ్గురు వ్యక్తులను గంజాయిని మరియు కారును భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించినారు. పట్టుబడిన వ్యక్తులు బూర్గంపహాడ్ మండలంలో పత్రికా విలేకరులు కావడం గమనార్హం. పట్టుబడిన గంజాయి విలువ రు. 20,25,000/- ఉంటుందని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ముగ్గురు వ్యక్తులను గంజాయిని మరియు కారును భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించినారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated On 30 Jan 2025 6:04 PM IST
cknews1122

cknews1122

Next Story