నోటీసులు ఇచ్చాము అంటున్న ఎం పి ఓ ..చర్యలు ఏవి ?
నోటీసులు ఇచ్చాము అంటున్న ఎం పి ఓ ..చర్యలు ఏవి ? నోటీసులు ఇచ్చి చర్యలు చేపడితే నిర్మాణం ఎలా పూర్తికావస్తుంది. "జి" ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం పట్టించుకోని అధికారులు శ్రీనగర్ పంచాయతీలో అనేక అక్రమ నిర్మాణాలు మాకు ఏమీ పట్టదు అన్నట్టు చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు. చేతులు తడిపితే ఏ నిర్మాణమైన ఇక్కడ చేసుకోవచ్చు. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, జనవరి 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి …
నోటీసులు ఇచ్చాము అంటున్న ఎం పి ఓ ..చర్యలు ఏవి ?
నోటీసులు ఇచ్చి చర్యలు చేపడితే నిర్మాణం ఎలా పూర్తికావస్తుంది.
"జి" ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం పట్టించుకోని అధికారులు
శ్రీనగర్ పంచాయతీలో అనేక అక్రమ నిర్మాణాలు
మాకు ఏమీ పట్టదు అన్నట్టు చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు.
చేతులు తడిపితే ఏ నిర్మాణమైన ఇక్కడ చేసుకోవచ్చు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
జనవరి 30,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీలో హద్దులు దాటి జి ప్లస్ త్రీ లిఫ్టుతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తు చొద్యం చూస్తున్న పంచాయతీ మండల జిల్లా అధికారులు.
1/70 యాక్ట్ ను తుంగలో తొక్కుతూ లిఫ్ట్ సౌకర్యాలతో జి ప్లస్ త్రీ నిర్మాణాలు చేపడుతున్న ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. జి ప్లస్ త్రీ నిర్మనల విషయాలపై ఎంపిఓ శ్రీనివాసరావును వివరణ కోరగా నోటీసులు ఇచ్చాము చర్యలు చేపడతాము అంటున్నారు. మరి నోటీసులు ఇచ్చి చర్యలు చేపడితే నిర్మాణం ఎలా పూర్తిగా వస్తుంది..
ఏజెన్సీ చట్టాలు శ్రీనగర్ పంచాయతీకి వర్తించవు అన్న రీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న పంచాయతీ సిబ్బంది నోటీసుల ఇచ్చామంటూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారి పని ఏంటో వారు చేయలేకపోతున్నా పరిస్థితి. ఇదంతా ఒక ప్లాను ప్రకారమే జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పునాది వేసినప్పుడే అడ్డుపడాల్సిన పంచాయతీ సిబ్బంది జి ప్లస్ త్రీ నిర్మాణం చేసినా కూడా కల్లుండి చూడలేని రీతిగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి సందేహం లేదు. కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రతిరోజు పంచాయతీ కార్యాలయాని కి వెళ్లాలంటే ఈ నిర్మాణం దాటి వెళ్ళలి.
మండల అధికారులు పంచాయతీలలో పర్యవేక్షించాలి అంటే ఈ జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం దాటే వెళ్లాలి అలాంటప్పుడు ఎవరికి కనిపించలేదంటారా లేక ముడుపులు ఏమైనా అందాయ అని అనుకుంటున్న ప్రజలు. శ్రీనగర్ పంచాయతీలో కొత్తగా ఇండ్లు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుండి పేర్లు మార్చడం కొరకు లక్షల వసూలు చేస్తున్నారని వినికిడి.
ఇటువంటివి దాదాపు ఈ పంచాయతీ లోనే పదుల సంఖ్యలో ఉన్నాయంటే మొత్తం మండల వ్యాప్తంగా ఎలా ఉందో పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇలాంటివ జరుగుతున్నాయి కాబట్టే అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది వీటిని అరికట్టేది ఎవరు? నోటీసులు ఇచ్చామంటూ చేతులు దులుపుకుంటున్నారు .
వాటిని ఆపే ప్రయత్నం ఏ అధికారి చేయలేకపోవడం వంటివి చూస్తుంటే శ్రీనగర్ పంచాయతీలో ఏ విధంగా డబ్బు చేతులు మారుతుందో అర్థమవుతుంది. ఇకనైనా జిల్లా అధికారులు కల్పించుకొని అక్రమ నిర్మాణాలను ఆపాలని కోరుతున్నా ప్రజలు..