ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అవ్వనుంది. కేబినెట్ మీటింగ్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. భేటీలో కుల గణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్రం వేయనుంది. అలాగే ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం …

ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అవ్వనుంది. కేబినెట్ మీటింగ్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. భేటీలో కుల గణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్రం వేయనుంది.

అలాగే ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసర్వేను ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ నివేదకను రెడీ చేశారు. ఈ తుది నివేదికను అధికారులు ఫిబ్రవరి 2వ తారీఖున కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కులగణ సర్వే నివేదకపై మంత్రి వర్గ సబ్ కమిటీ చర్చించి తుది నివేదకను ఆమోదం కోసం కేబినేట్‌కు సమర్పించనుంది. ఫిబ్రవరి 5న కేబినెట్ ప్రత్యేక భేటీలో దీని గురించి చర్చించనున్నారు. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు సమావేశంపై సీఎం ఇప్పటికి గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Updated On 30 Jan 2025 7:35 PM IST
cknews1122

cknews1122

Next Story