నేను కొడితే మాములుగా ఉండదు.. కాస్కో రేవంత్
నేను కొడితే మాములుగా ఉండదు.. కాస్కో రేవంత్ : KCR మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు కేఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను కొడితె మామూలుగా ఉండదని కేసీఆర్ రేవంత్ సర్కార్‌కు మాస్ మార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. …
నేను కొడితే మాములుగా ఉండదు.. కాస్కో రేవంత్ : KCR
మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు కేఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను కొడితె మామూలుగా ఉండదని కేసీఆర్ రేవంత్ సర్కార్‌కు మాస్ మార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ శక్తి ఎలాంటిదో కాంగ్రెస్ వాళ్లకి చూపించి మెడలు వంచుతామని గవర్నమెంట్‌పై ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అయ్యిందని కేసీఆర్ అన్నారు.
తులం బంగారానికి ఆశపడి తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కి ఓటేశారని ఆయన చెప్పారు. రైతు బంధుకి రాంరాం.. దళిత బంధుకి జై భీమ్ చెప్తారని ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు దొరికితే గ్రామాల్లో ప్రజలు కొట్టేలా ఉన్నారని బీఆర్ఎస్ బిగ్ బాస్ అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా. ప్రభుత్వ విధాలపై గంభీరంగా చూస్తున్నానని ఆయన చెప్పారు.