కేంద్ర బడ్జెట్. కేవలం అంకెల గారడీకే పరిమితం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డిఢిల్లీ ప్రెస్ మీట్ వివరాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది తప్ప.. ఆచరణలో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ప్రధాన పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో …

కేంద్ర బడ్జెట్. కేవలం అంకెల గారడీకే పరిమితం

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
ఢిల్లీ ప్రెస్ మీట్ వివరాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది తప్ప.. ఆచరణలో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ప్రధాన పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రం విస్మరించిందని అన్నారు.

ఇటీవలే.. కేంద్ర ప్రత్యేక బృందం ఇక్కడ సర్వే నిర్వహించినప్పటికీ కనీసం ఆ ప్రస్తావనే తెలేదని అన్నారు.

దక్షిణ అయోధ్య అయిన భద్రాచలానికి కేంద్ర ప్రభుత్వం కనీస నిధులు కేటాయించకపోవడం విస్మయానికి గురి చేసింది.

జాతీయ స్థాయిలో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ ).. పరిశ్రమలు విస్తృతంగా ఉన్న.. హైదరాబాదుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (ఏఐ) సెంటర్ ప్రకటించాలని.. 2023 తర్వాత ప్రతిపాదన చేసినప్పటికీ.. దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు.

ఇక క్యాన్సర్ సెంటర్, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావన తెచ్చినప్పటికీ.. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే నడుస్తాయనడంలో.. ఇటుకేమిటో అర్థం కావడం లేదు.

కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడిన ప్రసంగంలో.. కేటాయించిన నిధుల్లో దీనిపైనా స్పష్టత ఇవ్వలేదు.

ఏడు కోట్ల మందికి క్రెడిట్ కార్డులు ఇస్తామని ప్రకటించారు కానీ.. ఈ విశాల దేశంలో అర్హులు అంత తక్కువ మందే ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్న.

కేవలం బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. అక్కడ మెప్పు పొందేందుకు.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ బడ్జెట్ను రూపొందించినట్లు అనిపిస్తోందన్నారు.

ఉద్యోగులకు రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం బాగున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో విశ్రాంత ఉద్యోగుల గురించి పట్టింపు కనిపించలేదని మండిపడ్డారు

Updated On 1 Feb 2025 7:50 PM IST
cknews1122

cknews1122

Next Story