గోళ్లపాడులో స్వామివారి ప్రతిష్ఠ వేడుకకు రూ. 50 వేలు పంపిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆలయ కమిటీ బాధ్యులకు అందజేసిన కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ తన వంతుగా రూ. 20 వేలు ఇచ్చిన కొప్పుల ఖమ్మం రూరల్: గోళ్ళపాడు గ్రామంలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేoకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవం ఈనెల మూడవ తేదీన నిర్వహించనుండగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అపార దైవ భక్తితో, …

గోళ్లపాడులో స్వామివారి ప్రతిష్ఠ వేడుకకు రూ. 50 వేలు పంపిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

  • ఆలయ కమిటీ బాధ్యులకు అందజేసిన కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్
  • తన వంతుగా రూ. 20 వేలు ఇచ్చిన కొప్పుల

ఖమ్మం రూరల్: గోళ్ళపాడు గ్రామంలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేoకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవం ఈనెల మూడవ తేదీన నిర్వహించనుండగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అపార దైవ భక్తితో, ఆధ్యాత్మిక చింతనతో రూ. 50 వేలు పంపారు. ఈ మేరకు కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ ఆలయ కమిటీ బాధ్యులకు ఆదివారం ఆ నగదును అందజేశారు. అలాగే.. తన వంతుగా రూ. 20 వేలను ఆ స్వామివారి సేవ కోసం అందజేసి.. తన భక్తి భావాన్ని చాటుకున్నారు.
*ఈ సందర్భంగా.. కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ..*
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి గారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్నారని.. అయినప్పటికీ తన ద్వారా స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవం కోసం ఈ మేరకు నగదు పంపినట్లు తెలిపారు. ఆ దేవుడి కటాక్షం.. ప్రజలపై సదా ఉండాలని.. ఈ దైవకార్యం ఫలప్రదం కావాలని ఎంపీ ఆకాంక్షించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజలు ఖమ్మం ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ మద్ది వీరారెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు మక్కా శేఖర్ గౌడ్, మద్ది కిషోర్ రెడ్డి, పోలేపల్లి మాజీ సర్పంచ్ కూర్మా రావు, తనగంపాడు మాజీ సర్పంచ్ గుగ్గిళ్ళ శ్రీను, ఎం వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగా శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రామయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్, నాయకులు పాపా నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పంతులు నాయక్ పలువురు కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated On 2 Feb 2025 11:45 AM IST
cknews1122

cknews1122

Next Story