కాలుజారి కింద పడిపోయిన మేయర్… వీడియో వైరల్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. నగరంలో సుందరీకరణ పనుల్లో భాగంగా పర్యటన చేస్తుండగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఆమె కాలు జారీ కిందపడిపోయారు. ఆమెకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటీజన్లు విభిన్న రీతులో కామెంట్లు చేస్తున్నారు. …

కాలుజారి కింద పడిపోయిన మేయర్… వీడియో వైరల్

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. నగరంలో సుందరీకరణ పనుల్లో భాగంగా పర్యటన చేస్తుండగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఆమె కాలు జారీ కిందపడిపోయారు.

ఆమెకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

నెటీజన్లు విభిన్న రీతులో కామెంట్లు చేస్తున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద స్ట్రీట్ లైట్ పోల్ తగిలి కింద పడింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

వెంటనే అప్రమత్తమైన అధికారులు, కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. కాగా, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ఉదయం శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించారు.

చందానగర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్‌లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ పూజిత, జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించారు.

నూతనంగా వేస్తున్న రోడ్ల నాణ్యతను పరిశీలించారు. అలాగే ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated On 4 Feb 2025 12:31 AM IST
cknews1122

cknews1122

Next Story