కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణకు అన్యాయం ఇల్లందులో కాంగ్రెస్ నాయకుల నిరసన సి కె న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండల ప్రతినిధి ( పబ్బు సురేష్ ) :- ఫిబ్రవరి 3 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఆన్యాయం జరిగిందని ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ దానియల్, ఐ ఎన్ టి యు సి నాయకులు …
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణకు అన్యాయం
ఇల్లందులో కాంగ్రెస్ నాయకుల నిరసన
సి కె న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండల ప్రతినిధి ( పబ్బు సురేష్ ) :-
ఫిబ్రవరి 3
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఆన్యాయం జరిగిందని ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ దానియల్, ఐ ఎన్ టి యు సి నాయకులు మడుగు నవీన్, నీలపు రమేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ సూర్య, మాజీ కౌన్సిలర్లు పత్తి స్వప్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచమ్మ, మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెకె కాలనీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి గోయింగ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గోయింగ్ సెంటర్లో గల రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిరసన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని, రాష్ట్రం నుంచి 26 వేల కోట్ల పన్ను కడుతున్న కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం విపక్ష చూపిందన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బిజెపి ఎంపీలు సిగ్గుపడాలని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఢిల్లీ ముట్టడించిన రైతులను ట్రాక్టర్లతో తొక్కించారని, కార్మికుల హక్కులను కలరాసి నాలుగు నల్ల చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందని ఆరోపించారు. బిజెపి ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంటులో నిరసన చేపట్టి నిధులు తీసుకురావాలని తెలియజేశారు. నిర్మల సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతుందని, తెలంగాణ కట్టిన పన్నును ఏం చేస్తున్నారని, మా నిధులు మా హక్కుల కోసం పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేశారు.