గిరిజన బిడ్డ శ్రీనివాస్ నాయక్ ను ముట్టుకుంటే ఎంతటి వాడైనా వదిలేది లేదు : LHPS
గిరిజన బిడ్డ శ్రీనివాస్ నాయక్ ను ముట్టుకుంటే ఎంతటి వాడైనా వదిలేది లేదు శ్రీనివాస్ నాయక్ హత్యకు కుట్ర పన్నిన వారిని వదిలేది లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేందర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి గిరిజన బిడ్డ శ్రీనివాస్ నాయక్ కు లంబాడ హక్కుల పోరాట సమితి పూర్తి మద్దతు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ జోలికొస్తే వదిలిపెట్టం బిడ్డ గిరిజన బిడ్డకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు రాజకీయ …
గిరిజన బిడ్డ శ్రీనివాస్ నాయక్ ను ముట్టుకుంటే ఎంతటి వాడైనా వదిలేది లేదు
శ్రీనివాస్ నాయక్ హత్యకు కుట్ర పన్నిన వారిని వదిలేది లేదు
రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేందర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
గిరిజన బిడ్డ శ్రీనివాస్ నాయక్ కు లంబాడ హక్కుల పోరాట సమితి పూర్తి మద్దతు
సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ జోలికొస్తే వదిలిపెట్టం బిడ్డ
గిరిజన బిడ్డకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు
రాజకీయ నాయకులకి కేవలం మా మద్దతు కావాలా
మాపై కుట్రలు జరుగుతుంటే న్యాయం ఎక్కడ…?
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గిరిజన నాయకులు శ్రీనివాస్ నాయక్ కు మద్దతు తెలపాలి
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు - రాంబాల్ నాయక్ డిమాండ్
సి కే న్యూస్ షాద్ నగర్ :ఫిబ్రవరి 3
సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు, గిరిజన జాతి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న సభావాట్ శ్రీనివాస్ నాయక్ పై హత్యకు కుట్ర చేయడం దారుణమని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ తీవ్రంగా ఖండించారు. గిరిజన నాయకులు ఎదుగుదలను ఓర్వలేక కొందరు కక్షపూరితంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన బిడ్డలకు ఎవరైనా హాని తలుపెడితే కఠినమైన చర్యలు తప్పవని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా పరిష్కరించుకోవాలి కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హత్యలు చేసిన వ్యక్తితో పోలీసు అధికారి వెనుకాల వేసుకొని కక్ష సాధింపు చర్యలను పాల్పడడం సమాజానికి మంచిది కాదని అన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తే ఎంతటి వారికైనా వదిలి పెట్టేది లేదు బిడ్డ అని హెచ్చరించారు. గిరిజన జాతి కోసం ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని దేవాలయాలను నిర్మించడం, ధానధర్మాలు చేస్తుండడం కొనసాగిస్తున్నారని ఇలాంటి వ్యక్తులను కాపాడుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి కుట్రలు చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని అన్నారు.