
— వెలువర్తిలో రేషన్ డీలర్ దౌర్జన్యాన్ని అరికట్టాలి.
— రేషన్ డీలర్ పై అధికారులు స్పందించి చర్య తీసుకోవాలి.
నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లోనే రేషన్ షాపు నడిపిస్తున్న డీలర్.
సికే న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు జూన్ 5.
యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలోని రేషన్ షాపు డీలర్ కడవేరి నరసింహ వారి ఇంట్లో రేషన్ షాప్ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న సందర్భంగా ఆయన సోదరుడు కడవేరి యాదగిరి రేషన్ బియ్యాని తీసుకోవడానికి వచ్చిన బూడిద గీతపై కులం పేరుతో దూషిస్తూ బూతులు తిడుతూ ఇంట్లో నుంచి బయటికి నెట్టేయడంతో ఎడమ చేయి వేలుకు తీవ్రంగా గాయమైంది
ఈ సందర్భంగా మీడియా ద్వారా రేషన్ డీలర్ పై వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బూడిద రాజ్ కుమార్ గీత దంపతులు అధికారులను వేడుకున్నారు