
ఎస్సై రాణా ప్రతాప్ భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య.!
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ప్రస్తుత జిఆర్పి ఖమ్మం ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మ హత్య! వివాదస్పదం అయింది.
తమ కూతురిని ఎస్సైతో సహా ఆయన కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని మృతురాలి తల్లి తండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకి చెందిన రాణా ప్రతాప్ ది ఉద్యోగం వచ్చినప్పటినుండి దురుసుగా వ్యవహరించి పలు మార్లు శాఖ పరమైన చర్యలు తీసుకొన్నారు.
గత ఆరు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలో సస్పెండ్ అయి ఈమధ్య లూప్ లైన్ లో ఖమ్మం పట్టణ రైల్వే ఎస్.ఐగా బాధ్యత తీసుకున్నాడు. ఆయన ప్రజలతో, బంధువులతో, ఆయన భార్యతో కావాలి అని ఘర్షణకు దిగుతుంటాడని ప్రవర్తన స్థానికులు,మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
వృత్తి పరంగా కూడా వివాదస్పదుడిగా అతనికి పేరుంది!
గతంలో ఖమ్మం లో ట్రైని ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక వ్యాపారిని ఆయనతో పాటు ఆయన సోదరుడు అయిన మరో పోలీస్ ఎస్. ఐ ఆ వ్యక్తిపై గన్ను పెట్టి బెదిరించి , దాడి చేసినట్లు రాణా ప్రతాప్ పై ఆరోపణలున్నాయి..!
మహబూబాబాద్ జిల్లా సీరోల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తు నడి రోడ్డుపైన ఒక రైతు మీద దాడి చేసాడు. కొంత కాలం తరువాత కురవి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ గా వచ్చి స్టేషన్ గుండ్రతిమడుగులో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్పైన దాడి చేసాడు.
రజాలిపేటలో ఒక దళితుడు హత్యను తారుమారు చేసి సహజ మరణంగా చిత్రికరించే పని చేయగా, సీనియర్ జర్నలిస్ట్ అట్టి హత్య ఉదాంతం బైట పెట్టినందుకు ఆక్రమ అరెస్టు చేసాడు. ఆ విషయమై ఉన్నతాధికారులకు బాధితుడు డి. వై. గిరి పిర్యాదు చేయగా ఎస్పీ కార్యాలయంకు అటాచ్ చేసి విచారణ చేసారు.
తరువాత పెద్ద గూడూర్ మండల కేంద్రంలో ఎస్. ఐ గా పని చేస్తూ ఒక ప్రమాద వాహనాన్ని తారుమారు చేసిన ఆరోపణలపైన ఇన్సూరెన్స్ అధికారులు ఇచ్చిన పిర్యాదు మేరకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రాంనాథ్ ఆర్ కేకన్ విచారణ జరిపి ఉన్నాతాధికారులకు నివేదిక పంపించిగా రాణా ప్రతాప్ ను ఇటీవల సస్పెండ్ చేసారు.
నిత్యం దురుసు ప్రవర్తన వల్ల ప్రజలతో వ్యవహరించినట్లు , తన భార్యతో అలాగే ఉండి ఆ వివహిత మరణానికి కారణం అయినట్లు మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆవేశంకు లోనైనా వారు వారి అందరికి దేహశుద్ధి చేశారు.
అనుమానస్పద మరణంగా పోలీస్ కేసు నమోదు చేసి మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను మృతురాలి బంధువుల దాడి నుండి రక్షించి పోలీల అదుపులో ఉంచుకున్నారు.
డి.వై. గిరి
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్