
హైదరాబాద్ భారీ పేలుడు.. 10 మంది మృతి
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది.
ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.సోమవారం వేకువ ఝామన పటాన్‌చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది.
పేలుడు ధాటికి కంపెనీ షెడ్డూ కుప్పకూలింది. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా పలువురు మరణించి ఉంటారని తెలుస్తోంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భారీ శబ్దంతో రియాక్టర్ నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఆ ధాటికి కొందరు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు.
కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా.. ఐదుగురు మరణించారని సమాచారం. ప్రమాద సమయంలో లోపల 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడుతుండగా రెండు ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్‌లు చేరుకున్నాయి.
ఫ్యాక్టరీ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద‍్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.