EducationNotificationTelangana

6,238 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌…

6,238 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌…

6,238 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌…

నిరుద్యోగులకు రైల్వే బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా 6238 టెక్నీషియన్ పోస్టులకు నియామకాలకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నియామకాలు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జరుగుతాయి. 6,238 టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది.

గ్రేడ్‌-1 సిగ్నల్‌ – 183 పోస్టులు, టెక్నీషియన్‌ గ్రేడ్‌ – 3 కింద 6,055 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28వ తేదీ నుంచే ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 28వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.250 నుంచి రూ.500 వరకు ఉంది.

రైల్వేలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టెక్నీషియన్ నియామకం చాలా కాలం తర్వాత వెలువడింది. అభ్యర్థులు rrbapply.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రేడ్-1కి గరిష్ట వయోపరిమితి 33 సంవత్సరాలు కాగా, గ్రేడ్-3కి 30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల మరియు మహిళా అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.

రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, వీటిని 90 నిమిషాల్లో పరిష్కరించాలి. పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button