
నికార్సైన పార్టీ కార్యకర్త అబ్బాస్.. పగడాల నాగరాజు
అధికారమున్నా లేకున్నా పార్టీని పట్టుకుని ఉన్నాడు
పార్టీ అబ్బాస్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుంది
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, పగడాల నాగరాజు
సి కె న్యూస్ ప్రతినిధి
నికార్సైన పార్టీ కార్యకర్తగా పనిచేసి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినా గులాబీ జెండాను వదలని వ్యక్తిత్వం అబ్బాస్ ది అని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ అన్నారు.
మంగళవారం అబ్బాస్ సంస్మరణ సభ నగరంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ శ్రీ విద్య ల ఆధ్వర్యంలో అశేష జన సందోహం మధ్య జరిగింది.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ… అధికారం ఉన్నప్పుడు అందరూ ఉంటారని, పార్టీ అధికారంలో లేకున్నా అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో అబ్బాస్ ముందుకు సాగాడన్నారు. అబ్బాస్ లాంటి అనుచరుడు నాగరాజుకు దొరకడం అదృష్టమన్నారు.
2014 నుండి 2023 వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పదవులు అనుభవించారు. పెద్ద పెద్ద నాయకులు అయ్యారు కానీ అబ్బాస్ ఏ పదవి పొందలేదన్నారు. వారు అధికారం పోగానే పార్టీ మారారు. కానీ అబ్బాస్ మారలేదన్నారు.
నిబద్దత కలిగిన కార్యకర్త అబ్బాస్ అని, ఇలాంటి వారు పార్టీలో అరుదుగా ఉంటారన్నారు. అజయ్ మంత్రిగా ఉన్నప్పుడు అందరూ అయన పక్కన చేరారు. కానీ అధికారం లేకపోయినా ఇంతమంది సంస్మరణ సభకు రావడం మామూలు విషయం కాదన్నారు.
కేసీఆర్ వద్ద నుండి సామాన్య కార్యకర్త వరకు అందరిని ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. మళ్ళీ పార్టీని అధికారం లోకి తేవడమే అబ్బాస్ కు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.
నగర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ….దేవుడు ఒక్కడే అని నమ్మిన వ్యక్తి అబ్బాస్ అన్నారు. మైనారిటీ కులంలో పుట్టినా వినాయక చవితి, బతుకమ్మ లాంటి పండుగలు సైతం ఘనంగా చేసేవాడన్నారు. అబ్బాస్ ను నేను ఎప్పుడు తమ్ముడు గానే చూశాను.
మన వెంట ఉన్నవారికి మనం ఎంతైనా చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమంకు పునుకున్నానన్నారు. మాజీ మంత్రి అజయ్ జ్వరంతో బాధపడుతూ ఇక్కడికి రాలేకపోయారన్నారు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే రాష్ట్ర, జిల్లా పార్టీలు నాకు అండగా ఉండి మనోధైర్యం కల్పించారన్నారు.
అబ్బాస్ ను, నన్ను కాంగ్రెస్ పార్టీ వారు అనేక ఇబ్బందులకు గురి చేశారు. వారి మూలానే అబ్బాస్ అనారోగ్యం పాలయ్యాడన్నారు. ప్రాణాలనైనా వదులుకుంటాం కానీ వెన్నుచూపే నైజం మాదికాదన్నారు. అబ్బాస్ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటానన్నారు.
ఈ సభలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాఘభూషణం,మాజీ గ్రంధాలయ చెర్మన్ ఖమర్ ,కార్పొరేటర్లు, కర్నాటి కృష్ణ, శ్రీవిద్య ,మక్బూల్,కూరాకుల వలరాజు,బిరెడ్డి నాగచేంద్ర రెడ్డి మాట్లాడు తూ… అబ్బాస్ లాంటి కార్యకర్త మన పార్టీలో ఉండడం మన అదృష్టమన్నారు.
ఈ సభలో నాయకులు బచ్చు విజయ్ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మొరళి,కార్పొరేటర్లు జ్యోతి రెడ్డి ,పల్లా రోజ్ లీనా,మచ్చా నరేందర్ ,తాజుద్దీన్ ,శంషుద్దీన్ ,మెంతుల శ్రీశైలం ,కొప్పెర నర్సింహారావు , వీరు నాయక్ ,అమరాగాని వెంకన్న ,కొల్లు పద్మ ,సకీనా,సిద్ధసాబ్ ,పాలడుగు పాపారావు ,దడాల రఘు ,డోన్ వాన్ రవి ,పిన్ని కోటేశ్వరావు ,బోజెడ్ల రాంమోహన్ ,జిల్లా వ్యాప్తంగా ఉన్ననాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.