
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. గర్బంలోనే శిశువు మరణం..
పురిటి నొప్పులతో డెలివరీ కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీతో డాక్టర్లు,సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించారు..దీంతో శిశువు మరణించింది.
ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గర్భిణీ బాబాయ్ వజ్జా లక్ష్మణ్ ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం ఏడు గంటలకు పాల్వంచ మండలం మందరికలపాడు నుండి కోరం కరుణ 23 పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డెలివరీ నిమిత్తం అడ్మిట్ అయ్యారు.
అప్పుడు అక్కడ ఉన్న వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ కోసం గర్భిణీ మహిళతో ఎక్సర్సైజ్ చేయించారు.
అప్పటి డెలివరీ కాకపోవడంతో గర్భిణీ పురిటి నొప్పులు తట్టుకోలేక నాకు ఆపరేషన్ చేసి డెలివరీ చేయండి అని ఎంత ప్రాధేయపడినా కూడా వైద్య సిబ్బంది అంగీకరించకపోకడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి శిశువు హార్ట్ బీట్ ఆగిపోయిందని గ్రహించిన సిబ్బంది వెంటనే హుటాహుటిగా గర్భిణీ స్త్రీని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. శిశు ఉమ్మనీరు మింగడం, మెడలో పేగు వేసుకొని పుట్టడం వల్ల మరణించాడని తెలిపారు.
సిబ్బంది చనిపోయిన శిశువును బంధువులకు అప్పగించారని గర్భిణీ స్త్రీ బాబాయ్ లక్ష్మణ్ తెలియపరిచారు. ఇది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని గర్భిణీ మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు.డాక్టర్స్ డే రోజే డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.