
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. షోకాజు నోటీసులు!
తెలంగాణలో చంద్రబాబు కొవర్టులు ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టిస్తున్నాయి.
బనకచర్ల ఆపడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాస్తే సరిపోదని.. చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు, కరెంటు కట్ చేయాలని అప్పుడే ఆంధ్రా పాలకులు తమ వద్దకు వస్తారని కామెంట్ చేశారు.
తెలంగాణలో చంద్రబాబుకు కొవర్టులు ఉన్నారని.. వారు కట్టే బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటే, కోవర్టులకు నీటి కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్లు కట్ చేయాలన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపాలని, అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్గా బనకచర్ల బంద్ అవుతుందని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే జడ్చర్ల అనిరుధ్ రెడ్డిపై వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సీరియస్ అయ్యారు.
వెంటనే వ్యాఖ్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. అయితే, సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ మీటింగ్ తర్వాత.. అనిరుధ్ రెడ్డికి షకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.