
అనుమానస్పద స్థితిలో యువతి మృతి…
ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలి (21) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడపల్లి గ్రామానికి చెందిన పారా కిషోర్-లక్ష్మి దంపతుల కుమార్తె అంజలి,
గత సంవత్సరం సెప్టెంబర్ 9న సిరిపురం గ్రామానికి చెందిన తడికమల్ల రాము అనే యువకున్ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరు మధిరలోని సాయి నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.
గురువారం అంజలి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మృతి చెందిందని రాము పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ విషయం పోలీసులు అంజలి తల్లిదండ్రులకు తెలియజేయగా, రాము-అంజలి మధ్య మనస్పర్థలు జరుగుతున్నాయని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు.
రాము సోదరుడు కూడా అదే ఇంట్లో నివసిస్తున్నాడని, అంజలి ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని పేర్కొంటూ, అంజలి మృతి కేసును సరిగా విచారించాలని మధిర పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.