
రూ.85 వేల జీతంతో IBPS AFO పోస్టులు..! ఎలా అప్లై చేయాలో తెలుసా?
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది సూపర్ అవకాశమే.IBPS అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (Scale I) కేడర్లో 310 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం : జూలై 1, 2025
చివరి తేదీ : జూలై 21, 2025
ప్రాథమిక పరీక్ష : ఆగస్టు 30, 2025
ప్రధాన పరీక్ష : నవంబర్ 9, 2025
అర్హతలు:
వయసు : కనిష్టం: 20 సంవత్సరాలు
గరిష్టం: 30 సంవత్సరాలు (01.07.2025 నాటికి)
విద్యార్హత : వ్యవసాయం, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, డైరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇతర సంబంధిత విభాగాలలో 4 సంవత్సరాల డిగ్రీ.
ఎంపిక విధానం : ప్రాథమిక పరీక్ష (Prelims)
ప్రధాన పరీక్ష (Mains – Agriculture based)
ఇంటర్వ్యూకు హాజరై మెరిట్ ఆధారంగా ఎంపిక
జీతభత్యాలు:
మొదటి జీతం : రూ. 48,480 – 85,920/-
అదనంగా ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు (DA, HRA, Medical etc.)
దరఖాస్తు ఫీజు : SC/ST/PwBD అభ్యర్థులకు: ₹175
మిగిలిన వర్గాలకు: ₹850
దరఖాస్తు విధానం:
www.ibps.in వెబ్సైట్లోకి వెళ్ళండి
“CRP Specialist Officers” సెక్షన్లోకి వెళ్లండి
“Apply Online for Agriculture Field Officer (Scale I)” లింక్ క్లిక్ చేయండి
రిజిస్ట్రేషన్ చేయండి (Mobile & Email అవసరం)
అప్లికేషన్ ఫామ్ నింపండి
డాక్యుమెంట్స్ అటాచ్ చేసి, ఫీజు చెల్లించండి
ఫైనల్గా సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి
గమనిక:
ఈ పరీక్షల కోసం సరైన అగ్రికల్చర్ సిలబస్, ప్రాక్టీస్ టెస్ట్లు త్వరలో IBPS వెబ్సైట్లో పొందుపరచబడతాయి.