
మామతో ఆ యవ్వారం… కూతురిని హత్య చేసి మరో యువకుడిపై నెట్టిన తల్లి.. పోలీసుల దర్యాప్తులో బయటపడిన అసలు ట్విస్ట్!
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు అనే తన కొడుకు హరికృష్ణకు, సునీత అనే మహిళతో వివాహం జరిపించాడు. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులు ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
ఆ బిడ్డ పెరిగి 12 ఏళ్ల వయస్సుకు వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా ఆమె తల్లి సునీత, తన మామ నసింహరావుతో వివాహేతర సబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో సునీత, తన మామతో ఏకాంతంగా ఉండడాన్ని ఆమె 12 ఏళ్ల కుమార్తే చూసింది.
కూతురు తమను చూడడాన్ని తల్లి, ఆమె మామ గమనించారు. తమ సంబంధం గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిపోయారు. ఈ క్రమంలోనే తన కుమార్తెను హత్య చేసేందుకు సునీత తన మామాతో కలిసి ప్లాన్ వేసింది.
పథకం ప్రకారం ఇంట్లో బాలిక నిద్రిస్తున్న సమయంలో తన మామతో కలిసి సునీత ఇంట్లోకి వచ్చింది. నిద్రిస్తున్న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి హతమార్చింది. ఈ నెపం తమ మీదకు రాకుండా ఉండేందుకు బాలికకు ఫిట్స్ వచ్చిన పడిపోయినట్టు నాటకం ఆడారు. బాలికను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు ఖమ్మం తరలించాలని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయొద్దని సుతీన, ఆమె మామ వైద్యులను కోరారు.
ఈ క్రమంలో బాలిక మెడపై వైర్‌తో బిగించిన అచ్చులను గుర్తించిన వైద్యులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్న నాటి ఎస్ఐ కవిత ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు బాధితురాలి తల్లి, ఆమె మామ ఈ నెపాన్ని గ్రామంలోని మరో యువకునిపై మోపే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు దర్యాప్తులో ఈ హత్యతో ఆ యువకుడికి ఎలాంటి సంబంధం లేదని బయటపడింది.
దీంతో సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సునీతతో పాటు ఆమె మామను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చారు.
కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం సాక్షాదారాల ఆధారంగా నిందితులను దోషులుగా తేల్చుతూ.. ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.