
గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు.
జి ప్లస్ త్రీ నిలుపుదల చేయలేని అదికారులకు అధికారాలు ఎందుకు ?
ఆగినట్టే ఆగి ఊపందుకున్న జి ప్లస్ త్రీ నిర్మాణం.
అధికారుల అండదండలతోటే జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలు.
నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా ?
మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ అక్రమ నిర్మాణాలు.
జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నది అదికారులే.
జిల్లా అధికారుల దృష్టికి వెళ్లిన ఏమిచేయలేని పరిస్థితి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / లక్ష్మీదేవి పల్లి ప్రతినిధి,
జూలై 10,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి మండలంలో నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాల జోరు నోటీసులు అందజేసినప్పటికీ గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అధికారుల అండదండలతో లక్ష్మీదేవి పల్లి పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి ప్రక్కన అక్రమ జి ప్లస్ త్రీ నిర్మాణాలు పూర్తి కావొస్తూ ఊపందుకున్నాయి.
మే నెల పనులను నిలుపుదల చేసిన అధికారులు పనులు వేగవంతం అవుతున్న అటువైపు కన్నెత్తి చూడక పోవడంతో పనులన్నీ పూర్తి కావొస్తున్న అధికారులు స్పందించక పోవడంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి .
పట్టపగలే పైన కవర్లు తొలగించి నిర్మాణాలు చేస్తుంటే కంటపడకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. నోటీసులు అందజేశాం అంటూ చేతులు దులుపుకుంటున్న పంచాయతీ అధికారులు. నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా ? అక్రమ నిర్మాణం అని తెలిసి నోటీసులు అందజేసి చేతులు దులుపుకుంటే ఎలా వాటిని ఆపే అధికారం ఎవరికి లేదా ? ఆపే అధికారం అధికారులకు లేదా అక్రమ నిర్మాణాలని ఆపాల్సిన అధికారులు వారికి అండగా నిలుస్తూ జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారు. అనడంలో ఎటువంటి సందేహం లేదు.
లక్ష్మీదేవిపల్లి అన్నపురెడ్డిపల్లి చుంచుపల్లి మండల పరిధిలో ఇంత పెద్ద అక్రమ నిర్మాణం జరుగుతున్న ఎంపీ ఓ కు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ కనిపించ లేదంటారా లేదా ఇంకా ఏమైనా జరిగింటుందా అని చర్చించుకుంటున్న ప్రజలు. జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణానికి సహకరించుతున్న ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శిల పై చర్యలు తీసుకోవాలనీ కోరుతున్న ప్రజలు. అనుమాతులు లేకుండా నిర్మాణం మొదలుపెట్టిన మొదలుకొని జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తికావచ్చేవరకు అనగా కొన్ని నెలలుగా నిర్మాణం జరుగుతున్న అడ్డుకోకుండా నోటీసులు అందజేశాము అంటూ కాలయాపన చేస్తున్నారు
తప్ప పనులు ఆపలేకపోతున్నా పంచాయతీ మండల జిల్లా అధికారులు ప్రధాన రహదారుల ప్రక్కనే జి ప్లస్ త్రీ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారుల కంటపడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మండల పంచాయతీ అధికారులు చేయవలసిన పనులు చేయకుండా జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు.
దాదాపు నెల రోజులు కట్టడాలు నిలుపుదల చేసిన అధికారులు మరి ఏమి జరిగిందో ఏమో ఇంతకుముందు నిర్మాణాలకు అడ్డుగా కవర్ కప్పి పనులు చేసిన వారు పైన కవర్లు తొలగించి పనులు చేస్తున్నారంటే ఏమిటి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు.