
ప్రజా ఫిర్యాదు మేరకు ఏటూరునాగారం ఏ.ఎస్.పి హుకుం జారీ...
“ఇసుక లారీల పార్కింగ్ విషయంలో స్పష్టత కల్పించిన పోలీస్ శాఖ”
“ప్రయాణికులకు భంగం కల్పిస్తే” సహించేదే లేదు. ఏ.ఎస్.పి ఏటూరునాగారం”
“ఇసుక క్వారీ యాజమాన్యానికి ఏ.ఎస్.పి ఆదేశాలు జారి”
“ప్రజా ఫిర్యాదు మేరకు, స్పందించిన అధికార యంత్రాంగం”
“ములుగు జిల్లా సికే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లాలోని పలు మండలాలలో ఇసుక లారీల ఇష్ట రాజ్యం పార్కింగ్ విషయంలో తేల్చి చెప్పిన ఏ.ఎస్.పి ఏటూరునాగారం, ములుగు జిల్లా వ్యాప్తంగా పాత్రికేయుల కథనాలకు స్పందించిన ఏటూరునాగారం ఏ.ఎస్.పి పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఇసుక లారీ పార్కింగ్ విషయంలో ప్రజలకు స్పష్టత కల్పించారు..
ఇటీవల వెంకటాపురం మండలంలోని యాకన్నగూడెం రాళ్లవాగు వంతెన సమీప ప్రాంతాలలో బ్రిడ్జ్ మరమ్మత్తులు కొనసాగుతున్నందున పదుల సంఖ్యలో నిలిచిపోయిన ఇసుక లారీల వలన, స్థానిక ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి ఫిర్యాదుల మేరకు వెంకటాపురం మండల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా. సకాలంలో స్పందించిన వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని. జాతీయ రహదారిపై స్థానిక ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారినటువంటి. ఇసుక లారీల అడ్డు తొలగించారు… అనంతరం ప్రయాణికులకు సరళ మార్గం ఏర్పరిచారు..
ప్రయాణికుల ప్రజా ఫిర్యాదు మేరకు పలు మండలాలలో ఇసుక క్వారీ యాజమాన్యానికి ఏటూరునాగారం ఏ.ఎస్.పి ఇసుక లారీ యాజమాన్యం తప్పనిసరిగా లారీల పార్కింగ్ విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపారు… ప్రభుత్వ ఆంక్షలు విరుద్ధంగా ప్రవర్తిస్తూ తప్పటడుగులు వేస్తే మాత్రం. సహించేదే లేదు అని ఇసుక క్వారీల యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేశారు..