
ప్రాణం తీసిన మందు పార్టీ.. చెరువులో మృతదేహం లభ్యం
మందు పార్టీ ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రేగులగండి చెరువు ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం నాడు దేశవ్యాప్తిత సమ్మె నేపథ్యంలో భాగంగా సింగరేణి 145 బ్యాచ్ గల 15మంది ఈపి ఆపరేటర్లు ఒకచోట కలుసుకొన మందు పార్టీ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు.
ఐతే బుధవారం సమ్మె జరుగుతోందని భావించినా కార్మికులు ఆరోజు ఆ 15మంది కలిసి రేగులగండి చెరువు ప్రాంతంలో పార్టీ చేసుకుందామని వెళ్లారు. పార్టీ అనంతరం PK OC2కు చెందిన ఐదుగురు ఈపి ఆపరేటర్లు చెరువు లో ఈతకు దిగి సరదాగా ఈత కొట్టారు.
కొద్దీ సేపటికి అందులో ఉన్న నలుగురు ఒడ్డుకు రాగా మరో ఆపరేటర్ సుంకరి శ్రీనివాస్ చూస్తూ ఉండాగానే చెరువులో మునిగిపోయాడు. తోటి మిత్రులు రక్షించాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లభించ లేదు.
దీంతో శ్రీనివాస్ చెరువులో గల్లంతైన విషయాన్ని తోటి స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, రిస్క్యూ టీమ్, సింగరేణి అధికారులు గల్లంతైన కార్మికుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం,గురువారం ఎంత వెతికిన శ్రీనివాస్ మృతదేహం లభించలేదు. దీంతో శ్రీనివాస్ మృత దేహాన్ని వెలికి తీసేందుకు స్థానిక తహశీల్దార్ నరేష్ భద్రాచలంలో ఉన్న NDRF బృందానికి సమాచారం అందించి వారిని పిలించారు.
రంగంలోకి దిగిన NDRF బృందం విశ్వప్రయత్నాలు చేసి చివరికి శుక్రవారం ఉదయం సుమారు ఐదున్నర,ఆరు సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు.
శ్రీనివాస్ మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు, అటు తోటి స్నేహితులు చెరువు సాక్షిగా కన్నీటి అర్థనాధాలు వినిపించాయి.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.