
వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి
Web desc : వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిన ఘటన మల్లాపూర్ సూర్య నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
చర్లపల్లి డివిజన్లో గల మల్లాపూర్లో డెలివరీ కోసం నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కవిత అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం నవజాత శిశువు మృతి చెందింది.
ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలోనే.. అప్పటికే పాప మృతి చెందింది అని గాంధీ వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ లేకుండా స్టాఫ్ నర్స్ డెలివరీ చేసిందంటూ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.