
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల ఆగ్రహం…
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్
ప్రభుత్వ విద్యను సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అయ్యారు
రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థను నీరు గారుస్తున్నారు
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
సికె న్యూస్ ప్రతినిధి
దేవరకొండ మండల పరిధిలోని ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడడం లేదు అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో,గురుకుల పాఠశాలలో,హాస్టల్స్ నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది అని అన్నారు.ప్రభుత్వ విద్యను సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం అని ఆయన తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అయ్యారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థను నీరు గారుస్తున్నారు అని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో 60మంది విద్యార్థుల మరణించడం జరిగింది అని తెలిపారు.పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్న ముఖ్యమంత్రి అని అన్నారు.
విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదు అని అన్నారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది అని అన్నారు.కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ ఆదర్శంగా నిలిచింది అని గుర్తు చేశారు.విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆయన కోరారు..
రాష్ట్రంలో సంక్షేమ రంగం మొత్తం కూడా బ్రష్టు పట్టిపోయిందని విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగంలో ఉన్నటువంటి గురుకుల, ఆశ్రమ , వసతి గృహాలు,ప్రభుత్వ పాఠశాలలు మరియు అన్ని రకాల విద్యాసంస్థలలో కనీస పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచారంగా తయారైందని ఆయన అన్నారు.
గతంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో మరల విద్యా సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు కనీసం ఆశ్రమ పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించకపోవడంతో ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారని ఆయన ఆరోపించారు.