
అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇవాళ(సోమవారం) ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరోవైపు, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే మెగా డీఎస్సీపై ముందడుగు వేసిన ప్రభుత్వం..
ఇతర శాఖల్లోనూ ఖాళీలు పూర్తి చేస్తోంది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. అటవీ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..
అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇచ్చింది..
ఇక, ఏపీపీఎస్సీ.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం.. https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు