
మానవ సేవే మాధవ సేవ
మండల విద్యాధికారి సీతా లక్ష్మీ
విద్యార్థులకు ఐడీ కార్డ్, టై,బెల్టు పంపిణీ
ధర్మపురి పట్టణం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల న్యూ హరిజన వాడ విద్యార్థులకు విశ్రాంత మండల విద్యాధికారి మ్యాన రాజయ్య పాఠశాలలో విద్యార్థులకు పదివేల రూపాయల విలువ గల ఐ డి కార్డ్స్, టై, బెల్ట్ లను పంపిణీ చేశారు..
కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారి శ్రీమతి సంధ్యంభట్ల సీతాలక్ష్మి మాట్లాడతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహాయం అందించిన మ్యాన రాధ రాజయ్య లను అభినందిస్తూ పసి పిల్లలు దైవ సమానులని వారికి సేవ చేస్తే ఆ దైవానికి చేసినట్లే అన్నారు.
ఈ కార్యక్రమంలో దాత మ్యాన రాజయ్య,కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు వేముల రాజేష్ పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్ , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కనక తారా, అంగన్వాడి టీచర్ మాధవి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడాల రవీందర్ ఉపాద్యాయ బృందం బుగ్గరపు హరీష్,రొట్టె సరిత, మ్యాన సునీత,రావులపల్లి శ్రీనివాస్, బోగ శివ ప్రసాద్ ,మ్యాన పవన్ కుమార్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.