
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 నుంచి రాజీవ్ గాంధీ మెమోరియల్ టోర్నమెంట్..
టోర్నమెంట్ లో పాల్గొననున్న పాఠశాల బాలురు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్ 12,14, 16 విభాగాలకు టోర్నమెంట్లు..
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జూలై 17 ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే బాలురలకు క్రికెట్ క్రీడపై ఆసక్తిని పెంపొందింప చేసేందుకు ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ సారధ్యంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రోఫీ టోర్నమెంట్ పేరుతో ఆగస్టు 5వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ మతీన్, నిరంజన్, ప్రసాద్, శ్రీనులు పేర్కొన్నారు..రాజీవ్ గాంధీ మెమరీయల్ ట్రోఫీను అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీలలో టోర్నమెంట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో క్రికెట్ క్రీడా పోటీల నిర్వహణ కోసం తీర్మానం చేసినట్లు వారు వెల్లడించారు.. ఖమ్మంలో అండర్ 12 కేటగిరి, కొత్తగూడెంలో అండర్ 14, కల్లూరులో అండర్ 16 విభాగాలలో క్రీడాపోటిల నిర్వహణ వుంటుందని తెలిపారు. అండర్ 14 విభాగానికి నిరంజన్ 9182800880, అండర్ 16 ఇమ్రాన్, 9701633374, ఖమ్మం వీరేందర్ సిద్దు 9550072331,
శ్రీనివాస్ 9959824933
నంబర్లకు ఆసక్తి గలవారు సంప్రదించాలని వారు కోరారు. ఆధార్ కార్డ్, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. టోర్నమెంట్ తీర్మాన సమావేశoలో ముఖ్య అతిథులు ఆర్టిఏ డైరెక్టర్ వెంకన్న, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఫరీద్ ఖాద్రి, రాజీవ్ గాంధీ ట్రోఫీ కన్వీనర్లు అన్ని మండలాల కన్వీనర్లు, 14 మంది ఇన్చార్జిలు తదితరులు పాల్గొనగా సాయి నిరంజన్, శ్రీనివాస్, ప్రసాద్, ఇమ్రాన్, శ్రీకాంత్ కిషన్ సుభద్ర, సురేందర్, నరేందర్, మొయినుద్దీన్, వీరేందర్ నసీమా,సంధ్య, రాగిని, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలు, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..