
గిరిజన చట్టాలు గిరిజన జిల్లాలో వర్తించవా ?
అధికారుల అండదండలతో జి ప్లస్ త్రీ నిర్మాణాల జోరు.
గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అధికారుల అండతో నిర్మాణాలు.
మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరంటూ జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణదారుల జోరు
అధికారుల కంటికి కనిపించని లక్ష్మీదేవి పల్లి మండలం కార్యాలయం పక్కనే జి ప్లస్ త్రీ నిర్మాణం.
అన్నీ తెలిసి చోద్యం చూస్తున్న అధికారులు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ లక్ష్మీదేవి పల్లి ప్రతినిధి,( సాయి కౌశిక్),
జూలై 17,
లక్ష్మీదేవి పల్లె మండలంలో అధికారుల అండదండలతో జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి అనడంలో డబ్బులు ఎటువంటి సందేహం లేదు.
లక్ష్మీదేవి పల్లి మండలంలో నేషనల్ హైవే రోడ్డు పక్కన మండల కార్యాలయం ప్రక్కన జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాల విషమై వార్త తరంగాలు ప్రతినిధి పలుమార్లు పంచాయతీ సెక్రటరీకి ఎంపీఓకి డిఎల్పిఓకి వివరణ కొరకు ఫోను చేసినప్పటికీ ఫోను ఎత్తకుండా ఉండడం చూస్తుంటే కచ్చితంగా అధికారుల అండ దండలతో జి ప్లస్ త్రీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు వివరణ కొరకు పలుమార్లు ఫోను చేసిన స్పందించని అధికారులు .
ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి. ఏజెన్సీ చట్టాలను లెక్కచేయకుండా జి ప్లస్ త్రీ నిర్మాణాలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి.
గిరిజన చట్టాలంటే అధికారులకు లెక్క లేదా ? లేక మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు లే అని ధీమాతో అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారా అని చర్చించుకుంటున్న ప్రజలు. ప్రజా ప్రభుత్వంలో గిరిజన చట్టాలు గిరిజన జిల్లాలో వర్తించవా లేక గిరిజన జిల్లే కదా అని చిన్నచూపు చూస్తున్నారా ఈ అధికారులు.
మే నెల నుండి పలు దినపత్రికలలో ప్రచురించినప్పటికీ జి ప్లస్ అక్రమ నిర్మాణ దారుల అక్రమ నిర్మాణాలను ఆపే అధికారి లేరా లేక అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్క యారా అని చర్చించుకుంటున్న లక్ష్మీదేవి పల్లి ప్రజలు. ఇప్పటికైనా ఏజెన్సీ జిల్లాలో జరుగుతున్న జి ప్లస్ త్రీ నిర్మాణాలను నిలుపుదల చేసి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న జి ప్లస్ త్రీ నిర్మాణదారులపై వాటికి సహకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎంపీ ఓ లపై తగిన చర్య తీసుకోవాలని కోరుతున్న పలువురు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణాలు నిలుపుదల చేసి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.