
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్..
ఇక నెలకు రూ.వెయ్యి స్టైఫండ్
రాష్ట్రం నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయగా..
మరో లక్ష ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ స్టడీ సర్కిళ్లలో TGPSC, SSC, RRB, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 వరకు https://tgbcstudycircle.cgg.gov.in/FirstPage.do వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. డిగ్రీలో మార్కులను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున స్టైఫండ్ ఇస్తారు. అదేవిధంగా టీజీపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు గాను 5 నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
కాగా, త్వరలోనే కొత్తగా లక్ష ఉద్యోగాలను సృష్టించి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తామని ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్యుత్, విద్య, ఆర్టీసీ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఫ్రీ కోచింగ్ శిక్షణను అందించనున్నారు.