
డిగ్రీ అర్హతతో 5,000 జాబ్స్, అప్లై చేసుకోండిలా..
ఇంకా 4 రోజులే సమయం
బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) 2026-27 సంవత్సరానికి తాజాగా 5208 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్(పీవో/ఎంటీ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రిలిమినరీ, మెయిన్స్, వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఐబీపీఎస్ నియామక ప్రక్రియ చేపట్టనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 1వ తేదీ నుంచి 21 వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య : 5208
ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది : 2025 జులై 1
దరఖాస్తుకు చివరి తేది : 2025 జులై 21
ప్రిలిమినరీ పరీక్ష : 2025 ఆగస్టు
మెయిన్స్ పరీక్ష : 2025 అక్టోబర్
ఇంటర్వ్యూలు : 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి
వయస్సు : 2025 జులై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం : సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 – రూ.85,920 వరకు జీతం ఉంటుంది. ఇతర అలవెన్సులు బ్యాంకు నియమాల ప్రకారం వర్తిస్తాయి.
ఈ ఉద్యోగ ప్రక్రియలో పాల్గొనే బ్యాంకులు :
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీవో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దరఖాస్తు ప్రక్రియ : ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్) ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూ, తదనంతరం ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. (మెయిన్స్- 80శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం)
ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్ : https://www.ibps.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5208
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 21