Mulugu
Trending

వైభవంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

వైభవంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

వైభవంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను తలపించిన ఉత్సవాలు

మహిళల ఆత్మవిశ్వాసానికి వేదికగా నిలిచిన కార్యక్రమాలు

మంత్రులు, ఎమ్మెల్యేల చెక్కుల పంపిణీతో ఉత్సాహం వెల్లివిరిచిన వేడుకలు

రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు

410 మంది బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా, 5474 మందికి లోన్ బీమా చెక్కులు

మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సులు, వ్యాపారాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అగ్ర భాగాన మంత్రి సీతక్క

నేటితో ముగియ‌నున్న సంబురాలు

సంబురాల విజయం కోసం కృషిచేసిన అధికారులకు, మహిళా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్, జూలై 17 :

ఇందిరా మహిళా శక్తి సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాన్ని త‌ల‌పిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినూత్న కార్య‌క్ర‌మాల‌తో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాలు సంబురాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబురాలు బ‌తుక‌మ్మ వేడుల‌కు త‌లపిస్తున్నాయి.ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వేల సంఖ్య‌లో మ‌హిళా స‌భ్యులు పాల్గొంటు త‌మ‌కు ద‌క్కిన గౌర‌వాన్ని చాటుతున్నారు. ఆర్దిక విజ‌యాలు సాధించిన మ‌హిళ సంఘాలు మంత్రుల నుంచి స‌న్మానాలు అందుకున్నాయి. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటు వ‌డ్డీ చెక్కుల‌ను పంపిణి చేస్తున్నారు. మహిళా శక్తిని అభినందిస్తూ, మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న నూతన కార్యక్రమాలను వివరిస్తున్నారు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. మ‌హిళా సంఘాలచే నిర్వ‌హించబ‌డే ఆర్టీసీ నూత‌న అద్దెబ‌స్సుల‌ను, వివిధ వ్యాపారాల ప్రారంభోత్స‌వాలు చేస్తూ మ‌హిళా సంఘాల‌ను ప్రొత్స‌హిస్తున్నారు.

ఈ సంబురాల్లో భాగంగా మహిళల విజయగాథలు, ప్ర‌భుత్వ ప్రొత్సాహంతో సాగిస్తున్న వ్యాపారాలు, పొందుతున్న ఆదాయం, త‌మ వ్యాపార అనుభ‌వాల‌ను వేదికల‌పై వివ‌రించారు. వేల కోట్ల రూపాయ‌ల రుణ స‌దుపాయం క‌ల్పించ‌డంతో పాటు అన్ని వ్యాపారాల్లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న ప్ర‌జా ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగిన ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబ‌రాలు శుక్ర‌వారంతో ముగియ‌నున్నాయి. ప‌ది రోజుల పాటు నియెజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళా సందోహ‌మే క‌నిపించింది. ఇందిరా మహిళా శక్తి ఉత్సవాలు మహిళా సాధికారతకు వేదిక‌గా నిలిచాయి. ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబురాల్లో భాగంగా ఈ దఫా మ‌హిళా సంఘాల‌కు రూ. 344 కోట్ల ను ప్ర‌భుత్వం చెల్లించింది. ఇందులో గ్రామీణ మహిళ సంఘాలకు రూ. 300 కోట్లు , పట్టణ మహిళా సంఘాలకు రూ. 44 కోట్ల చెల్లింపులు చేసింది.

ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఆడ‌బిడ్డ‌ల‌ను ఆర్దికంగా బ‌లోపేతం చేసేందుకు, వారి చే సొంత వ్యాపారాల‌ను ప్రారంబింప చేసేందుకు ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కంలో బాగంగా ప్ర‌తి ఏటా కనీసం రూ.25 వేల కోట్ల‌కు త‌గ్గ‌కుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా మ‌హిళా సంఘాల‌కు ప్ర‌భుత్వ‌మే రూణాల‌ను స‌మ‌కూర్చుతోంది. మ‌హిళ‌లు తీసుకున్న లోన్ల‌కు స‌కాలంలో వ‌డ్డీలు చేల్లిస్తోంది. దీంతో పాటు ప్ర‌మాద బీమా, లోన్ బీమా వంటి స్కీంల‌ను అమ‌లు చేస్తుంది. దీంతో ప్ర‌మాద వ‌శాత్తు మ‌హిళా స‌భ్యురాలు మ‌రిణిస్తే ఆ కుంటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా మొత్తాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. ఎవ‌ర‌న్న మ‌హిళ‌లు న‌ష్టాల‌తో బ్యాంకు లోన్లు చెల్లించ‌లేని ప‌రిస్థిలో ఉంటే, ఇత‌ర మ‌హిళ‌ల‌కు భారం కాకుండా ప్ర‌భుత్వ‌మే రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ బీమా చెల్లిస్తుంది. ఇప్పటివరకు 410 మంది స‌భ్యుల‌కు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయలు చెల్లించ‌గా, లోన్ బీమా కింద 5474 మంది స‌భ్యుల‌కు రూ. 2 లక్షల వరకు చెల్లింపులు చేసింది.

ప్రమాద బీమా, లోన్ బీమా తోపాటు ప్ర‌జా ప్ర‌భుత్వం సకాలంలో వడ్డీలు చెల్లిస్తుండ‌టంతో ఉత్సాహంగా మహిళా సంఘాల్లో కొత్త స‌భ్యులు ఉత్సాహంగా చేరుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 1.67 లక్షల మంది మ‌హిళ‌లు మహిళా సంఘాల్లో కొత్త‌గా స‌భ్యులుగా చేరారు. దీంతో పాటు మ‌హిళా సంఘాల్లో చేరే స‌భ్యుల అర్హ‌త వ‌య‌సును స‌డలించారు. గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వ‌య‌సులో గ‌ల మహిళలకే అవ‌కాశాలుండ‌గా…ఇప్పుడు 15-65 ఏండ్ల మ‌హిళ‌ల‌కు మహిళా సంఘాల్లో చేరే అవ‌కాశం క‌ల్పించారు. దీంతో పాటు దివ్యాంగ మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక సంఘాల‌ను ఏర్పాటు చేసే ప్ర‌క్రియ ఊపందుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు ప్రాధాన్యత విశేషంగా పెరుగుతోంది. దీంతో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో ప్ర‌స్తుతం ఉన్న 64 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాన్ని కోటి వ‌ర‌కు చేర్చే కార్య‌చ‌ర‌ణ‌ను అమ‌లు చేస్తున్నారు.

ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబురాల్లో చురుగ్గా మంత్రి సీత‌క్క‌

ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క చురుకైన పాత్ర పోషిస్తు మ‌హిళా శ‌క్తిని చాటుతున్నారు. రాష్ట్ర క్యాబినెట్ స‌భ్యులంతా త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో, తాము ఇంచార్జ్ గా ఉన్న జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబురాల్లో పాల్గొంటు కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేస్తున్నారు. కాగా మంత్రి సీత‌క్క సంబురాల్లో విస్త్రృతంగా పాల్గొంటున్నారు. సంబ‌రాల్లో భాగంగా కామారెడ్డి, పెద్ద‌ప‌ల్లి, ములుగు, ఇల్లందు, భూపాల ప‌ల్లి తో పాటు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌రుస కార్య‌క్ర‌మాల్లో పాల్గోని మ‌హిళ‌ల్లో ఉత్తేజాన్ని నింపారు. మహిళ సాధికారత కు ప్ర‌జా ప్ర‌భుత్వం ఇస్తున్న ప్ర‌ధాన్య‌త‌ను వివ‌రించారు.

తెలంగాణ త‌ల్లి రూపానికి రాజ ముద్ర వేయ‌డం మొద‌లుకుని రంగాల వారిగా మ‌హిళా సంఘాల‌కు ఇస్తున్న అవ‌కాశాల‌ను మంత్రి సీత‌క్క‌ ప్ర‌జ‌లకు వివ‌రించారు. ఆడ‌బిడ్డ‌ల‌ భాగ‌స్వామ్యంతో రైజింగ్ తెలంగాణ‌-2047 ల‌క్ష్యాన్ని సాధిస్తామ‌న్న నమ్మ‌కాన్ని గురువారం నాడు ములుగులో నిర్వ‌హించిన ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబురాల వేదిక‌గా వ్య‌క్త‌ ప‌రిచారు. ప్ర‌భుత్వ ప్రొత్స‌హంతో స్వ‌యం ఉపాధి నుంచి సంప‌ద సృష్టి దాకా మ‌హిళా సంఘాలు ఎద‌గ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేసి ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జా ప్ర‌భుత్వ చేయుత‌తో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ఆత్మ‌విశ్వాసంతో అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి సంబురాల‌ను విజ‌య‌వంతం చేసిన స‌హ‌చ‌ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ధ‌న్యవాదాలు తెలిపారు. సంబురాల‌ను స‌జావుగా సాగేలా కృషి చేసిన సెర్ప్ సీఈవో దివ్యా దేవ‌రాజ‌న్, అడిష‌న‌ల్ సీఈఓ కాత్యాయ‌ని, జిల్లా కలెక్ట‌ర్లు, పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు, జిల్లాల‌ అధికార యంత్రాంగాన్ని అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!