
హోండా షోరూంలోకి వరదనీరు.. చిక్కుకున్న 30 మంది సిబ్బంది
కాపాడిన ఎన్ డిఆర్ ఎఫ్ బృందాల పోలీసులు
హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ‘పైగా’ కాలనీ, విమాన నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం చోటుచేసుకుంది.
ముఖ్యంగా హైదరాబాద్ – రసూల్‌పురలోని ‘పైగా’ కాలనీ విమాన నగర్‌లో భారీ వర్షంతో ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో సుమారు 30 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. రక్షించాలంటూ పోలీసు, డీఆర్‌ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూమ్ సిబ్బంది సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన హైడ్రా, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. షోరూమ్ వెనుకవైపు నుంచి కార్మికులను తరలించారు. కొందరిని బోట్ల ద్వారా పోలీస్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు.