
ఉన్నత విద్యపై కృత్రిమ మేధస్సు ( ఏఐ) ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి..?
చాట్- జీపీటీ వంటి ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ప్రమేయం పెరుగుతున్నందున కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..?
లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
ఢిల్లీ ఉన్నత విద్యపై కృత్రిమ మేధ ( ఏఐ ) ప్రభావాలు ఎలా ఉండనున్నాయి..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సోమవారం ప్రశ్నించారు. చాట్ – జీపీటీ ఏఐ ఆధారిత సాఫ్ట్ వేర్ ప్రమేయం పెరుగుతున్నందున తీసుకున్న చర్యలు ఏంటి..? అని లిఖితపూర్వకంగా కోరారు. దీనికి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుఖాంత ముజుందార్ సమాధానమిచ్చారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020ని ప్రారంభించింది. విద్యార్థులలో ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేధస్సు, పర్యావరణ విద్య, ప్రపంచ పౌరసత్వ విద్య ( జిసిఈడి) మొదలైన సమకాలీన విషయాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
వాతావరణ మార్పు, డిజిటల్ మార్కెట్ విస్తరణ, కృత్రిమ మేధస్సు పెరుగుదల వంటి వేగవంతమైన మార్పుల కారణంగా బలమైన పరిశోధనా పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం కూడా ఎన్ఈపీ లక్ష్యం.
సాంకేతిక విద్యలో ఏఐను ప్రోత్సహించడానికి..ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఏఐసిటిఈ) ఐటీ ప్రోగ్రామ్లకు జోడించింది. మెకానికల్, సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి నాన్-కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ల కోసం ప్రత్యేక ఏఐ కోర్సులు రూపొందించబడ్డాయి.
ఇవి వాటి రంగాలలో అల్ అప్లికేషన్లను ఏకీకృతం చేస్తాయి. 2021లో డేటా సైన్స్ కోసం ఒక నమూనా పాఠ్యాంశాలను సిద్ధం చేసింది. అధ్యాపకులు కొత్త టెక్నాలజీలతో ముందుకు సాగడానికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను కూడా నిర్వహిస్తున్నాం.
విద్యా మంత్రిత్వ శాఖ యొక్క స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ (ఎస్ డబ్ల్యూ ఏవైఏఎం) 110 కి పైగా ఉచిత ఏఐ -సంబంధిత కోర్సులను అందించింది. వీటిని ఐఐటీలు, ఐఐఎస్ సి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహిస్తాయి. ఇప్పటి వరకు 41.2 లక్షలకు పైగా విద్యార్థులు ఈ కోర్సులలో చేరారు.
2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ. 990 కోట్ల వ్యయంతో ఆరోగ్యం, వ్యవసాయంపై కృత్రిమ మేధస్సులో మూడు కేంద్రాల ( సీఈఓ ఈఎస్)ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
భారత ప్రభుత్వం మార్చి 7, 2024న “ఇండియా ఏఐ ” మిషన్ను ప్రారంభించింది. కృత్రిమ మేధస్సులో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలనేది లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ( ఎంఎం టిటిపి)ని అమలు చేస్తున్నాం. విద్యా మరియు వృత్తిపరమైన పద్ధతులలో బాధ్యతాయుతంగా అధ్యాపకులను సిద్ధం చేసేలా వ్యవస్థను నడుపుతున్నాం.