
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు.
జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం90,205 మంది పరీక్షలు రాశారు. కాగా టెట్ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. మొదటి పేపర్లో 61.50 శాతం ఉత్తీర్ణత సాధించగా రెండవ పేపర్ లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఫలితాలు ఆధికారిక వెబ్సైట్స్ https://tgtet.aptonline.in/tgtet/ తో పాటు https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.