
హైవేపై దారిదోపిడి ముఠా..హల్ చల్..!
బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్ ఐ కూచిపూడి జగదీష్..
సీ కె న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు,తిరుమలాయపాలెం
బుధవారం ఖమ్మం–వరంగల్ హైవేపై రాత్రి దారిదోపిడి ముఠా చెలరేగిపోయారు.ఎస్ ఐ కూచిపూడి జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం..రాజమండ్రి నుంచి గుజరాత్ వైపు బయల్దేరిన లారీని టార్గెట్ చేసిన దుండగులు, బజాజ్ డీజిల్ ఆటోతో పాటు,ద్విచక్ర వాహనంపై వెంబడించి పాతర్లపాడు స్టేజీ సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లు ప్రక్కన ఉన్న ధాబా నిర్వాహకుడు రుస్తుమ్ ఖాన్ పై దాడి చేసి చంపుతామణి బెదిరించి 10వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అనంతరం ప్రక్కనే ఉన్న లారీ డ్రైవర్ దిలీప్ ముచ్చర్ పై దాడి చేసి 8వేల రూపాయలు లాక్కొని వెళ్లారని తెలిపారు.ధాబా నిర్వాహకుడు రుస్తుమ్ ఖాన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ కూచిపూడి జగదీష్ ఓ ప్రకటనలో తెలిపారు.