
ఫ్రీజ్ లో మాంసం పెడుతున్నారా!
అయితే ఈ వార్త మీ కోసమే
ఫ్రిజ్‌లో పెట్టిన మాంసం తిని విషాదం – ఒకరు మృతి, ఏడుగురికి అస్వస్థత
ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారాన్ని వేడి చేసి తినడంతో విషపూరిత ప్రభావం ఏర్పడి, ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంటలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, చింతల్‌కుంట ఆర్టీసీ కాలనీలో నివసించే శ్రీనివాస్ యాదవ్ (46) ఆదివారం బోనాల పండుగ సందర్భంగా మటన్ బోటి, చికెన్ తీసుకువచ్చి వండుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిన్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, సోమవారం మళ్లీ వేడి చేసి తిన్నారు. అయితే ఆహారం విషపూరితం కావడంతో కుటుంబ సభ్యులందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.
వెంటనే వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతిచెందారు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.