
డెంగ్యూ జ్వరంతో యోగ టీచర్ మృతి..
Web desc : తల్లాడ: డెంగ్యూ జ్వరంతో యోగ టీచర్ మృతి చెందిన సంఘటన తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కందుల శ్రీదేవి (32) తల్లాడ లోని హోమియో వైద్యశాలలో యోగ టీచర్ గా పనిచేస్తుంది.
మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న ఆమె తల్లాడ పిహెచ్సిలో వైద్య పరీక్షలు చేయించుకోగా జ్వరం తగ్గక పోవడంతో వైద్య నిమిత్తం అక్కడ నుంచి ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడ నుంచి మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ గురువారం నాడు మృతి చెందింది. మృతురాలికి భర్త కందుల నరసింహారావు, కుమార్తె యశశ్రీ (11)ఉన్నారు.
కుమార్తె యశశ్రీ కి కూడా డెంగ్యూ లక్షణాలతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. యువతి మేనల్లుడు నిషాల్ డెంగ్యూ లక్షణాలతో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు.
ఆమె మృతి పట్ల తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి రత్న మనోహర్ ను వివరణ కోరగా విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.