
వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ సస్పెన్షన్
Web desc : బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి పరాయి స్త్రీ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చండూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఖలీల్ నల్లగొండలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులకు వాట్సాప్ చాటింగ్ తో పాటు మరికొన్ని ఆధారాలు పోలీసులకు బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కానిస్టేబుల్ వాట్సాప్ చాటింగ్ లు, ఇతర ఆదారాలను పోలీసులకు సమర్పించారు.
అయితే వీరి ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాననే నేపంతో తనను చంపాలని చూస్తున్నారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గతంలోనూ ఖలీల్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులోను ఖలీల్ పేరు ప్రస్తావన ఉన్నది. కాగా, ఈ కేసుపై నల్లగొండ స్పెషల్ టీం పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే కానిస్టేబుల్ ఖలీల్ పై వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ గా తీసుకుని సస్పెండ్ చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.