
ఎంపీపీజీసీలో 346 ఖాళీలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం..
మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీలో ఉన్న 346 పోస్టులను భర్తీ చేసేందుకు నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ప్రకటించిన వివరాలను పరిశీలించి, ఆన్‌లైన్ నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) – మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & సివిల్ మొత్తం 73 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (JE) – మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & సివిల్ మొత్తం 90 పోస్టులు
ప్లాంట్ అసిస్టెంట్ – మెకానికల్ (53 పోస్టులు), ఎలక్ట్రికల్ (37 పోస్టులు)
ఆఫీస్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, స్టోర్ అసిస్టెంట్, ఫైర్‌మ్యాన్, సెక్యూరిటీ గార్డ్, వార్డ్ బాయ్ & వార్డ్ ఆయా వంటి అనేక సపోర్ట్ స్టాఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తంగా, 346 పోస్టులను నియమించనున్నారు.
పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.
8, 9, 10వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత రంగంలో BE/BTech డిగ్రీ ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు MBBS మధ్యప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు నిమిషానికి 80 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం అవసరం.
కొన్ని పోస్టులకు 5 సంవత్సరాల వరకు అనుభవం కూడా ఉండాలి.అభ్యర్థికి కనీసం 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయసు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, EWS, దివ్యాంగులు మరియు మధ్యప్రదేశ్ మహిళలు వయస్సు సడలింపు పొందుతారు.
ఆన్‌లైన్ విధానంలో, అభ్యర్థులు జనరల్ కేటగిరీ అయితే, రూ. 1200 రుసుము, రిజర్వడ్ కేటగిరీ (SC/ST/OBC/EWS/PwD) రూ. 600 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు పోస్టును బట్టి వేతనం ఉంటుంది. కాగా, నెలకు రూ.15,500 నుండి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది.
రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా, శరీరక పరీక్షలు (కొన్ని పోస్టులకు మాత్రమే), పత్రాల పరిశీలన, వైద్య పరీక్ష.
దరఖాస్తులు ప్రారంభం: జూలై 23
mppgcl.mp.gov.in
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.. mppgcl.mp.gov.in
2. “కెరీర్” విభాగంపై క్లిక్ చేసి, సంబంధిత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ, అడిగిన వివరాలను నమోదు చేసి, లాగిన్ అవ్వండి.
4. ఇప్పుడు, లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫార్మ్‌ను పూరించండి.
5. సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది