
బాలుడిపై వీధికుక్కల వీరంగం…
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం రోజున వీధి కుక్కలు ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం వీధి కుక్కల నియంత్రణపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ బాలుడి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీ అధికారులకు పలు సార్లు వినతి పత్రాన్ని అందించారు. అయినా వీధి కుక్కల దాడులు నిత్యం చోటు చేసుకుంటున్నప్పటికీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో ప్రతిరోజూ వీధి కుక్కల దాడులలో అనేక మంది చిన్నారులు, ప్రజలు గాయాలపాలవుతున్న తరుణంలో అధికారులు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.