
విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి నెల రోజులు అవుతున్నా..విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదనలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువ రైతు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీ తీసిన రైతు రమేష్ నాయక్
పంటలు వేసే సమయం అయిపోతుందని, త్వరగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాలని ఎన్ని సార్లు కోరినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతు
పంటలు వేసే సమయం అయిపోయిందని, ట్రాన్స్‌ఫార్మర్ లేక కరెంట్ లేక పంట వేయలేకపోయానని సబ్ స్టేషన్లో విద్యుత్ అధికారుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు రమేష్ నాయక్. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.