Andhra PradeshEducation

సివిల్స్ లో ర్యాంకు సాధించిన జయశ్రీకి ఘన సన్మానం

సివిల్స్ లో ర్యాంకు సాధించిన జయశ్రీకి ఘన సన్మానం

సివిల్స్ లో ర్యాంకు సాధించిన జయశ్రీకి ఘన సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా…

పలమనేరు ,మార్చి 8, CK న్యూస్

పలమనేరు మండలం, జరావారిపల్లికి చెందిన, ముణెమ్మ, శ్రీరాములు రెడ్డి కుమార్తె జయశ్రీ సివిల్స్ లో ఆల్ ఇండియా 360 ర్యాంకు సాధించారు.

ఈ సందర్భంగా పలమనేర్ సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు జరా వారిపల్లికి వెళ్లి, జయశ్రీని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మధుమోహన్రావు మాట్లాడుతూ… చదువులో కానీ, స్పోర్ట్స్ కానీ, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, ఈ విధమైన సన్మానం వారి ఇంటి వద్దకే వెళ్లి చేయడం జరుగుతున్నదని, అదే వరవడిని కొనసాగిస్తూ… జయశ్రీ కి కూడా సన్మానం చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

పలమనేర్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని, చదువులో కానీ స్పోర్ట్స్ లో కానీ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, సివిల్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్కు శాలువా, బొకే, మహారాజా క్యాప్ తో ఘనంగా సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ…. ఈ సత్కారం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఈ కార్యక్రమంలో మధుమోహన్రావు ,జయశ్రీ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button