
ఫ్రిజ్ ఓపెన్ చేస్తూ కరెంట్ షాక్ తో మహిళ మృతి…
ఓ మహిళ ఫ్రిజ్ ఓపెన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబోడలో సోమవారం ఉదయం జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానికంగా నివాసముండే పద్మారావు కోడలు బల్లి లావణ్య (35) ఉదయం తన ఇంట్లో ఫ్రిజ్ ఓపెన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది.
అక్కడే ఉన్న లావణ్య కూతురు తన తల్లిని రక్షించే క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. అపస్మారక స్థితికి చేరుకున్న లావణ్యను వెంటనే అత్తాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే లావణ్య భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఫ్రిడ్జ్ ను గమనించగా దానికి కరెంట్ తీగ తగిలి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.