
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి…
ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నల్ల ప్రదీప్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రదీప్ 317 జీఓ కింద నల్గొండ నుంచి నగరానికి బదిలీపై వచ్చాడు.
ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 2021 డిసెంబర్ నుంచి పని చేస్తున్నాడు. ఎల్బీనగర్, ఎస్‌బీహెచ్ కాలనీలో నివాసముంటున్నాడు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు.
విధులకు హాజరయ్యేందుకు మంగళవారం ఉదయం ఇంట్లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా కుర్చీలో నుంచి కింద పడి పోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
వెంటనే ప్రదీప్‌ను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని శ్రీకరా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే ప్రదీప్ మృతి చెందాడు. ప్రదీప్ గుండె పోటు కారణంగా మృతి చెందినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.