
పాఠశాలలో పరీక్ష రాస్తూ విద్యార్థిని మృతి
పాఠశాలలో పరీక్ష రాస్తూ పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన ప్రతిమ (15) గొల్లగూడెం ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పరీక్ష రాస్తూ ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది.
ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.