
షాద్ నగర్ ఏసిపి కి వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు
జర్నలిస్టు కారు ధ్వంసం కేసులో నిందితులను గుర్తించండి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, నరేశ్
తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేసిన ఎసిపి లక్ష్మీనారాయణ
సి కే న్యూస్ షాద్ నగర్:జులై 29
షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు ఎండి ఖాజాపాషా (కేపీ) కారును అర్ధరాత్రి ధ్వంసం చేసిన కేసులో నిందితులను గుర్తించాలని మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని షాద్ నగర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు స్థానిక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. లక్ష్మీనారాయణను కోరారు.
మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఎసిపిని కలుసుకొని వినతి పత్రం అందజేశారు.
జర్నలిస్టు కేపీ కారు ధ్వంసం ఘటనపై రోజురోజుకు ఆయా రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని విచారణ త్వరగా సజావుగా చేపట్టి నిందితులను గుర్తించాలని ఎసిపి దృష్టికి తెచ్చారు. మీడియాపై పథకం ప్రకారం దాడులు నిర్వహించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకొని మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఏసిపిని కోరారు.
ఈ సంఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని కొంతమంది కేసు పక్కదారి పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దాడి ఎవరు చేశారు ఎందుకు చేశారు చట్ట ప్రకారంగా ప్రజలకు వివరించి ఈ సంఘటనకు బాదులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు ఏసీపిని కోరారు.
జర్నలిస్ట్ కేపీపై జరిగిన దాడిని కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు అనువుగా మలుసుకొని రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని వాస్తవాలు వెలుగు చూస్తే ఈ కేసు లో బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
విచారణ జరుగుతుంది న్యాయం చేస్తాం ఎసిపి లక్ష్మీనారాయణ
జర్నలిస్ట్ కేపీ కేసు విచారణలో ఉందని సీఐ విజయ్ కుమార్ తదితర పోలీసు సిబ్బంది అన్ని సాక్షాధారాలు సేకరిస్తున్నారని తప్పకుండా నిందితులను గుర్తిస్తామని ఏసిపి లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు.
వినతి పత్రం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణలో ఉందని వాస్తవాలు తెలుసుకుంటున్నామని పూర్తి సాక్షాదారాలతో ఈ కేసును పరిశోధించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు మీడియాపై దాడులు జరగకుండా పోలీసులు రక్షణ కల్పిస్తారని ఇందులో ఎలాంటి సందేహం లేదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
పోలీసులు చేపడుతున్న విచారణకు అందరు సహకరించాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సంజీవ్ కుమార్, లక్కాకుల రమేష్ కుమార్ మన్సూర్ అలీ ఖాన్ , నరసింహ రెడ్డి, మహా టీవీ మోయిజ్, ప్రైమ్ నైన్ ఆంజనేయులు, బిఆర్కె న్యూస్ చందు, మోయిజ్, ఇక్బాల్, కాలేద, ఆర్ టి వి సాయినాథ్ రెడ్డి, రాజ్ న్యూస్ రాకేష్, జ్యోతి మహేష్, పోలీస్ నిఘా కృష్ణ, ఎస్ బి బాలు, రవి, మల్లేష్, దర్శనం శంకర్, మేఘా శ్రీహరి, గిరిబాబు, బూర్గుల రమేష్ , జగన్, కలిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.