
సహజీవనం చేసిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం
కోదాడ (సూర్యాపేట జిల్లా), తనను పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి ఏడేళ్ల పాటు సహజీవనం చేసిన ప్రియుడు చివరకు మాట తప్పిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెళ్లికి నిరాకరించడంతో బాధిత మహిళ ప్రియుడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
పోలీసుల కథనం ప్రకారం, కోదాడ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత గత కొన్ని సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ కోమరబండకు చెందిన యువకుడితో సహజీవనం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె అతడిని పెళ్లికి ఒప్పించగా, అతడు నిరాకరించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని మంటలు పెట్టుకుంది.
అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.