
నాకు లోపల అనిపించిందే మాట్లాడాతా.. నేను మారను
విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీలో ఉన్నాడు. రేపు రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ కు ఓ ప్రశ్న ఎదురైంది.
గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను ఎప్పుడూ నాకు ఏది మాట్లాడాలి అనిపిస్తే అదే మాట్లాడుతూ. ఇప్పుడు ఇలా మాట్లాడాలి అనిపిస్తోంది.
అందుకే పద్ధతిగా ఉంటున్నా. నన్ను ఎవరూ తక్కువ చేసి మాట్లాడొద్దు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి.
వాటిని అందుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఇలా ఉంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ టైమ్స్ లో చూస్తే విజయ్ దేవరకొండ చాలా హుందాగా మాట్లాడుతున్నాడు.
గత ప్రెస్ మీట్స్ లో చూస్తే ఆయన మాట్లాడే విధానం వేరే విధంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నాడు.
ఇది అనుభవాల వల్ల వచ్చిందా లేదంటే కింగ్ డమ్ పాత్ర వల్ల వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న కింగ్ డమ్ జులై 31న థియేటర్లలోకి వస్తోంది. భాగ్య శ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.